వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. మొన్నటి సమావేశాల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖల వారీగా తమ అభిప్రాయాలను తెలిపారు. తగిన సమయం లేని కారణంగా కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పలేకపోయారు. ఈసారి 36 ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు సిద్ధం చేయనున్నారు. సదస్సు […]
చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం […]
అమరావతి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుండగా.. వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. విజయవాడలో […]
సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్రపంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి.. ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎనర్జీదే ప్రముఖ పాత్ర అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనల ద్వారా విద్యార్థులు కొత్త వాటిని కనుగొనాలని మంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో […]
కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు వేశారు. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి.. అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు కడప డీటీసీపై ఆరోపణలు ఉన్నాయి. కడప డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం మహిళా […]
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం: వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని […]
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ‘ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ […]
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. […]
గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో […]
ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్‌ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఘటన మరువక ముందే.. మరో కిలాడి లేడీ తానో ట్రైని ఐఏఎస్ అధికారిని అంటూ హంగామా చేసింది. అంతేకాక తాను రాజకీయ నాయకుల బంధువునని కటింగ్‌లు కొట్టింది. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆగడాలతో పోలీసు వర్గాలకు టెన్షన్ పట్టుకుంది. అమృత భాగ్య రేఖ అనే మహిళ తన భర్తతో […]