కారణాలు ఏవైనా సరే భర్తలను కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు తీస్తున్నారు. కాగా ఈనెల 12న వ్యక్తి బోడుప్పల్ లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు భార్యపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మృతుడి భార్య పద్మను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. భర్తను హత్య చేసిన కేసులో భార్యను అరెస్టు చేశారు మేడిపల్లి పోలీసులు.