హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ఆదివారం రాత్రి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా […]
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జనై 23వ పుట్టినరోజు వేడుకలు జరగగా.. సిరాజ్ హాజరయ్యాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ సింగర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ఓ ఫొటోలో ఇద్దరూ (జనై, సిరాజ్) కాస్త సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాంతో వీరిద్దరూ డేటింగ్లో […]
వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు […]
మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. దావోస్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు. రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్ […]
విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం […]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ […]
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారని, ఓ చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. భారీ విజయం కట్టబెట్టిన ప్రజల నమ్మకంను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ […]
నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్: విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో […]
విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు […]