Virat Kohli: సింగిల్ డిజిట్‌కే కింగ్ కోహ్లీ ఔట్.. స్టేడియం వీడుతున్న ఫాన్స్!
- రంజీ ట్రోఫీ 2025లో బరిలోకి విరాట్
- సింగిల్ డిజిట్‌కే కోహ్లీ ఔట్
- నిరాశగా స్టేడియం వీడుతున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కింగ్.. సింగిల్ డిజిట్ (6)కే పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్ బౌలర్ హరీష్ సంగ్వాన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దాంతో విరాట్ ఆటను చూద్దామని వచ్చిన అభిమానులు నిరాశగా అరుణ్ జైట్లీ స్టేడియంను వీడుతున్నారు. మరోవైపు విరాట్ కూడా అసహనంతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడాడు. చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ తరఫున 23 మ్యాచ్‌ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో విరాట్ 5 సెంచరీలు చేశాడు. 6 పరుగులకే అవుట్ అవ్వడంతో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. రౌండ్ మ్యాచుల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ నిరాశపర్చారు. ప్రస్తుతం ఢిల్లీ 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో ఆయుష్ బదోని (25), సుమిత్ మాథుర్ (17) ఉన్నారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది.
Also Read
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025
Delhi crowd started leaving after Virat Kohli got out. pic.twitter.com/FynuOsVXtF
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2025
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!