అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా విషయం తెలిసిందే. సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చైతూ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ పరంగా రికార్డు బిజినెస్ చేస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా చై కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read : Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!
ఏంటంటే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, చైతూ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘బెదురులంక’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్ చెప్పిన వైవిధ్యమైన కథకు చైతన్య ఇంప్రెస్ అయ్యారట. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను బన్నీ వాసు (బీవీ వర్క్స్), సునీల్ నారంగ్ కలిసి నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు హీరోయిన్ వివరాలు వెల్లడి కానున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ డైరెక్టర్లతో చైతూ తన లైనప్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.