మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 12) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ వన్డేలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ బాదడంతో ఫాన్స్ […]
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్ […]
కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.87 వేలు దాటేసింది. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి.. రూ.79,800గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి.. రూ.87,060గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధరలు మాత్రం […]
టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేయడంతో ఈ ఘనత సొంతమైంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు 15,404 పరుగులు చేశాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు. సచిన్ […]
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గాయం కారణంగా మొదటి వన్డే ఆడని విరాట్.. రెండో వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లండ్ డీఆర్ఎస్ తీసుకుని సక్సెస్ అయింది. Also Read: […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జో రూట్ (69; 72 బంతుల్లో 6×4), డకెట్ (65; 56 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ […]
గత కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ శతకం బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట హిట్‌మ్యాన్ […]
ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించిందని, తన బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టానని, వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు.. తన ప్రణాళికలు అమలు పరిచానని హిట్‌మ్యాన్ తెలిపాడు. శుభ్‌మన్ క్లాసీ ప్లేయర్ అని, పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడని రోహిత్ ప్రశంసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా […]