Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!
- రంజీ ట్రోఫీ 2025లో బరిలోకి విరాట్
- కేరింతలతో మైదానాన్ని హోరెత్తించిన ఫాన్స్
- కోహ్లీ కోసం 15 వేల మంది అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ 2025కి కొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్ మాదిరి అరుణ్ జైట్లీ స్టేడియం ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలతో హోరెత్తింది. గురువారం ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-డి మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగాడు. కింగ్ ఫీల్డింగ్ చేస్తేనే అభిమానులు కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారంటే.. ఇక బ్యాటింగ్ దిగి బౌండరీలు బాదితే ఇంకేమన్నా ఉందా?. మొత్తానికి విరాట్ రంజీ ట్రోఫీ 2025కి కళ తెచ్చాడని చెప్పాలి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఉపేంద్ర యాదవ్ (95; 177 బంతుల్లో 10×4, 1×6) తృటిలో సెంచరీ కోల్పోగా.. కర్ణ్ శర్మ (50; 105 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ, సుమిత్ మాథుర్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్, యష్ ధుల్ ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు అవుట్ అయినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడు. 12 ఏళ్ల తర్వాత కింగ్ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. కోహ్లీని చూసేందుకు ఏకంగా 15 వేల మంది అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండోరోజు ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుంది.
Also Read
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
This is the stardom of Virat Kohli. 🙇♂️🐐 pic.twitter.com/zZ5vQGkclC
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2025
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..