శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను, మండపాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయ అధికారులు ముస్తాబు చేశారు. ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు […]
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం సీఎం ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరనున్నారు. మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. […]
విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. లీగల్‌గా తాము చూసుకుంటాం అని, భయపడవద్దు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దైర్యం చెప్పారన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దని పంకజశ్రీ కోరారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో భర్త వంశీని ములాఖత్‌లో పంకజశ్రీ కలిశారు. దాదాపు 30 […]
రాష్ట్రంలో నచ్చని వారిపై కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా అని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని, ప్రతీ చోటా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీని చూస్తే ఆక్రోశం వస్తోందని జగన్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వంశీని ములాఖత్‌లో జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో […]
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ […]
అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా: రాష్ట్రంలో నచ్చని వారిపై కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా అని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని, ప్రతీ చోటా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీని చూస్తే ఆక్రోశం వస్తోందని జగన్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వంశీని ములాఖత్‌లో జగన్ కలిశారు. […]
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాహుల్ మీనా చెప్పారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో […]
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది. వీఐపీ బ్రేక్ సమయంలో నకిలీ టికెట్లతో భక్తులను లోపలికి తీసుకెళ్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. శ్రీశైల దేవస్థాన సిబ్బంది అనుమానం వచ్చి టికెట్లు తనిఖీ చేయగా.. నకిలీ టికెట్ల గుట్టు రట్టయింది. సదరు వ్యక్తిని ఆలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. శ్రీస్వామివారి స్పర్శ దర్శనం పాత టికెట్లను ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి.. కొత్త టికెట్లు తరహాలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డులో పేర్లకు, టికెట్లలో […]
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ (50)గా గుర్తించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కావలి మండలం రుద్రకోట జాతీయ రహదారిపై […]
గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది. తన భర్త పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్‌పై అతని భార్య అనసూయ ఫిర్యాదు చేసింది. భార్య అనసూయ ఫిర్యాదుతో పాటు డీఐజీ కిరణ్ అక్రమ సంబంధాల ఫోటోలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన భార్యతో ఆరు సంవత్సరాలుగా ఎలాంటి సంబంధం లేదని, పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకున్నామనిడీఐజీ కిరణ్ చెబుతున్నాడు. […]