Sampath Kumar
Author- NTV Telugu-
Sunil Gavaskar: ఐపీఎల్ ఆడుతా.. 76 ఏళ్ల వయసులో గవాస్కర్ విజ్ఞప్తి!
భారత జట్టు ప్రస్తుతం యూఏఈలో ఆసియా కప్ 2025లో ఆడుతోంది. రెండు సూపర్-4 మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్ అనంతరం టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. తనను జట్టులోకి తీసుకోవాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోరినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన […] -
AP High Court: సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐని సుమోటోగా ఇంప్లేడ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాడేపల్లిలో ఉన్న సవీంద్ర రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన లాలాపేట పోలీసులు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో […] -
IND vs PAK: అభిషేక్ బచ్చన్‌ను త్వరగా అవుట్ చేస్తే.. పాకిస్థాన్ ఈజీగా గెలుస్తుంది: అక్తర్
ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్లో ఇండో-పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఘన విజయాలు సాధించింది. ఫైనల్లోనూ పాక్‌ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పై భారీ […] -
CM Chandrababu: గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్.. ఐటీ హబ్‌గా విశాఖ!
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో […] -
Botsa Satyanarayana: బాలకృష్ణ మామూలుగా ఉన్నాడా?.. ఆ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం!
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో భాగమయ్యాడా? అని అడిగారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. మండలి చైర్లో ఒక దళితుడు కూర్చున్నాడని అవమానించాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు కాపాడాలని, కానీ […] -
CM Chandrababu: లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 […] -
Jogi Ramesh: చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు!
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ కనపడటం లేదని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం […] -
YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
రైతు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సీఎం చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం తెలిపిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సీఎంను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ షర్మిల బయదేరారు. మెడలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్‌తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. […] -
IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. 2025 ఎడిషన్‌లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో […] -
Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!