గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది. తన భర్త పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్‌పై అతని భార్య అనసూయ ఫిర్యాదు చేసింది. భార్య అనసూయ ఫిర్యాదుతో పాటు డీఐజీ కిరణ్ అక్రమ సంబంధాల ఫోటోలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన భార్యతో ఆరు సంవత్సరాలుగా ఎలాంటి సంబంధం లేదని, పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకున్నామనిడీఐజీ కిరణ్ చెబుతున్నాడు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో కిరణ్ కుమార్ నెల్లూరు డీఐజీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయను కొన్నేళ్ల కిందట కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్, అనసూయ మధ్య విభేదాలు రావడంతో.. ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. గత ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అనసూయపై కిరణ్ దాడి చేశాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయారు. స్థానికులు అనసూయను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అనసూయ గుంటూరు అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నారు.
ఫిర్యాదు అనంతరం అనసూయ మీడియాతో మాట్లాడుతూ… ‘మేము ప్రేమ వివాహం చేసుకున్నాం. మాకు పిల్లలు పుట్టకపోవటంతో పాపను దత్తత తీసుకున్నాం. సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చాను. కొన్నేళ్లుగా కిరణ్ వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాడు. వేధింపులు తాళలేక పది నెలల అతడికి దూరంగా ఉంటున్నా. పాప విదేశాల్లో చదువుకుంటుండగా.. బాబు నాతోనే ఉంటున్నాడు. రెండు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్తుంటే కిరణ్ అడ్డుకుని బాబును, నన్ను కొట్టాడు’ అని చెప్పారు.