తిరుమల అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలపకుండానే ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. అతడిని నిలువరించేందుకు యత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపై దూసుకెళ్లాడు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు తిరుమల లోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సింగాలగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద […]
కాస్త లేట్ అయినా.. తన కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్‌లో తాము 20 పరుగులు తక్కువగా చేశామన్నాడు. చెన్నైకి ఏమాత్రం అవకాశం అవ్వకుండా.. తమ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. నితీశ్ రాణా బ్యాటింగ్‌లో ఇచ్చిన మెరుపు ఆరంభం చాలా కీలకంగా మారిందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ […]
పవర్ ప్లేలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10×4, 5×6) అద్భుత బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించదగినదే అని, గౌహతి బ్యాటింగ్‌కు మంచి వికెట్ అని చెప్పాడు. మ్యాచ్‌లో ఓడినా తమకు సానుకూల అంశాలు ఉన్నాయని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆదివారం గౌహతిలో […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఏదోలా నెట్టుకొస్తున్నాడని, హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్ లేదని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అన్నారు. 3-4 ఏళ్ల క్రితం నాటి రోహిత్ అయితే కాదని, రోజు రోజుకూ అతడి ఆట పడిపోతోందన్నారు. పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజసిద్ధమైన బ్యాటింగ్ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడని విమర్శించారు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలని మంజ్రేకర్ సూచించారు. జియోస్టార్‌లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం […]
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఎస్ఆర్హెచ్యాజమాన్యం […]
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది. Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు […]
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక […]
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హార్దిక్‌కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్‌ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ […]
ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తళుక్కున మెరిశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి స్టేజ్‌పైన ర్యాంప్ వాక్ చేశారు. బంధాని ఫాబ్రిక్‌తో రూపొందించబడిన నల్లటి గౌనులో జాన్వీ హొయలు పోయారు. జాన్వీ అందాలు, ర్యాంప్ వాక్కు అందరూ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు జాన్వీ కపూర్ షో […]