మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో మూవీ శురూ అయింది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. చిరు-అనిల్ మూవీ పూజా కార్యక్రమంకు దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, వశిష్ఠ, బాబీ, శ్రీకాంత్ ఓదెల.. నిర్మాతలు అశ్వనీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, నాగవంశీ.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read: Cancer Survey: బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవు.. తేల్చిన వైద్య ఆరోగ్య శాఖ!
చిరు-అనిల్ మూవీని సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కూతురు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందని తెలుస్తోంది. ఓ హీరోయిన్ పాత్ర కోసం అదితిరావు హైదరిని సంప్రదించారని సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అద్భుత పాటలు అందించిన సిసిరోలియో.. ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు. మెగా 157, చిరు అనిల్ వర్కింగ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీతో పాటు యాక్షన్‌ను సైతం ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.