ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్, […]
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తుండడంపై […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్‌కతా నైట్ […]
2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. Also Read: […]
స్టార్ హీరోయిన్ సమంత చివరగా ‘ఖుషి’లో నటించారు. ఖుషి అనంతరం 1-2 వెబ్ సిరీసులు చేసిన సామ్.. నిర్మాణ సంస్థ స్థాపించారు. సమంత ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నుంచి మొదటి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమా టీజర్.. ఉగాది పర్వదినం సందర్భంగా రిలీజ్ అయింది. శుభం టీజర్ చూస్తుంటే.. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. Also Read: Heroine Sneha: అరుణాచలంలో స్నేహ అపచారం.. […]
దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ముందుంటుంది. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు.. దర్శనం తర్వాత జీవితం వేరు అని అంటుంటారు. ఇక్కడ గిరిప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకుంటే.. అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఎంతో విశేషమైన క్షేత్రంగా అలరారుతున్న అరుణాచలంను నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఎందరో సెలబ్రిటీలు కూడా అరుణాచల శివుడిని దర్శించుకుంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ స్నేహ తన భర్త ప్రసన్న కుమార్‌తో కలిసి అరుణాచలం వెళ్లారు. అయితే […]
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం రోజురోజుకు ముదురుతోంది. హెచ్‌సీఏ బ్లాక్ మెయిలింగ్ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆదివారం కోరింది. వెంటనే ఈ వివాదంను పరిష్కారించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి. Also Read: Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్ స్క్వేర్’ […]
డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తొలి చిత్రం ‘మ్యాడ్’. తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిన్న హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని […]
భారత్‌లో తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు తాను చూస్తుంటా అని శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ తెలిపాడు. పుష్ప సినిమా బాగుందని, అప్పటి నుంచి తాను ఎక్కువగా తెలుగు చిత్రాలు వీక్షిస్తున్నానని చెప్పాడు. మైదానంలో పుష్ప తరహాలో సంబరాలు చేసుకోవడం బాగుందని హసరంగ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ శివమ్ దూబెను ఔట్ చేసిన […]
ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయానికి 20వ ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. క్రీజ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి బంతికే ధోనీని అవుట్ చేశాడు. ఆపై 13 పరుగులే చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ […]