పవర్ ప్లేలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10×4, 5×6) అద్భుత బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించదగినదే అని, గౌహతి బ్యాటింగ్‌కు మంచి వికెట్ అని చెప్పాడు. మ్యాచ్‌లో ఓడినా తమకు సానుకూల అంశాలు ఉన్నాయని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆదివారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 పరుగుల తేడాతో ఓడిపొయింది.
మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘పవర్ ప్లే ఆటలో చాలా కీలకం. పవర్ ప్లేలో మేం అదనంగా పరుగులు ఇచ్చాం. నితీష్ రాణా బాగా బ్యాటింగ్ చేశాడు. అతడిని మేం ఆదుకోలేకపోయాం. మిస్ ఫీల్డ్ ద్వారా 8-10 పరుగులు అదనంగా ఇచ్చాం. ఫీల్డింగ్ విషయంలో మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. 180 పరుగులు ఛేజింగ్ చేధించదగినదే. ఇది బ్యాటింగ్‌కు మంచి వికెట్. హిట్టింగ్ చేస్తే భారీ స్కోర్ చేయొచ్చు. 210 పరుగుల దిశగా సాగిన రాయల్స్‌ను 180 పరుగులకు కట్టడి చేయడం సంతోషం. గతంలో 3వ స్థానంలో అజింక్యా రహానే, మిడిల్ ఓవర్లలో అంబటి రాయుడు బాధ్యత తీసుకొని ఆడేవారు. రాహుల్ త్రిపాఠి టాప్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తదనుకున్నాం. ఇది పెద్ద సమస్యే కాదు’ అని చెప్పాడు.
Also Read: Rohit Sharma: రోజురోజుకూ రోహిత్ ఆట పడిపోతోంది.. ఏదో నెట్టుకొస్తున్నాడు అంతే!
‘మిడిల్ ఓవర్లను ఆడడానికి నేను కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని మేము భావించాము. నేను గత మూడు మ్యాచ్‌ల్లో ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చాను. నేను మూడో స్థానంలో ఆడాలని వేలం సమయంలో నిర్ణయించారు. అందుకు నాకు ఏ సమస్య లేదు. అవసరమైనప్పుడు నేను రిస్క్ తీసుకోగలను, స్ట్రైక్‌ను రొటేట్ చేయగలను. దురదృష్టవశాత్తు మాకు మంచి ఆరంభాలు దక్కడం లేదు. శుభారంభాలు దక్కితే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మ్యాచ్‌లో ఓడినా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా బాగా బౌలింగ్ చేశారు. బౌలింగ్ విభాగంలో మాకు కాస్త మూమెంటమ్ అవసరం. ఒక్కసారి ఆ మూమెంటమ్ వస్తే మేము విజయాల బాట పాడుతాం’ అని రుతురాజ్ గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు.