కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. 20 మంది వార్డు మెంబర్లలో 14 మంది వైసీపీ, ఆరు మంది టీడీపీకి ఉన్నారు. ప్రస్తుతం ఉపసర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. వైసీపీ వార్డు మెంబర్లను టీడీపీ నేతలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దాంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పోలీసులు ఇరవర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. జడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర […]
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్‌స్టేసన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ […]
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ శాపం కాకూడదన్నారు. డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే లోక్‌సభ సీట్ల పునర్విభజన చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘ పునర్విభజన పారదర్శనకంగా జరగాలి. […]
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ-3 పంప్‌హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆరంభం అయ్యాయి. రాత్రి వరకు పలు కారణాలతో మొరాయించిన మూడో దశలోని దేవన్నపేట పంపు హౌస్ మోటర్లు ప్రారంభమయ్యాయి. దీంతో గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. మోటార్లు ఆన్ కావడంతో.. అధికారులు, మెగా కంపెనీ, ఆస్ట్రియా దేశ ఇంజినీర్లు ఆనందం వ్యక్తం చేశారు. దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌస్ ప్రారంభం కాకపోవడంతో.. సాగునీరు అందక రైతులు […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 పెరగగా.. నేడు రూ.440 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.100 పెరగగా.. నేడు రూ.400 పెరిగింది. గురువారం (మార్చి 27) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,840గా.. 22 క్యారెట్ల ధర రూ.82,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో […]
హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు ఏం జరిగింది?, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకుముందు బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చగా.. ఈ వాహనాల […]
శాసనమండలి ఆవరణలో ‘రైతు రుణమాఫీ’ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని.. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కనపెట్టారని మధుసూదన చారి మండిపడ్డారు. చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం […]
పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీడియా మిత్రులకు సరైన భోజనం కూడా పెట్టలేని ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. శాసన సభ్యుడుగా తనకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని హుజురాబాద్ ఎమ్మెల్యే […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరీక్షా పత్రం లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. లీకేజీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బుధవారం (మార్చి 26) కూడా కామారెడ్డిలో లీకేజీ ఘటన చోటుచేసుకుంది. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో సిబ్బంది పరీక్షా పత్రంలోని కొన్ని ప్రశ్నలను లీక్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని […]
భద్రాచలం పట్టణంలో ఓ ఆధ్యాత్మిక సంస్థ నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం కింద శిథిలాల్లో ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి బతికి ఉన్నాడని భావించి కామేష్ అనే మేస్త్రీని బయటికి తీసుకు రావడానికి సింగరేణి రెస్క్యూ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసింది. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే బయటకు తీసుకొచ్చే సమయానికి అతడు మృతి […]