ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయానికి 20వ ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా.. క్రీజ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి బంతికే ధోనీని అవుట్ చేశాడు. ఆపై 13 పరుగులే చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ అనంతరం ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Tirumala: తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వ్యక్తి హల్ చల్!
రాజస్థాన్, చెన్నై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ మాట్లాడుకున్నారు. ద్రవిడ్ గాయంపై ధోనీ ఆరా తీశాడు. కాసేపు మాట్లాడిన అనంతరం చెన్నై యువ క్రికెటర్లను ద్రవిడ్‌కు మహీ పరిచయం చేశాడు. యువ క్రికెటర్లతో ద్రవిడ్ కరచాలనం చేయడం విశేషం. ఐపీఎల్ 2025కు ముందే ద్రవిడ్ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. ఓ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్ కాలుకు బంతి బలంగా తాకింది. కట్టు, కర్రలతోనే రాజస్థాన్ శిబిరంలో చేరిన ద్రవిడ్.. ఐపీఎల్ మ్యాచుల సమయంలో మైదానానికి వెళ్తున్నాడు.
MS Dhoni with Rahul Dravid. ❤️🐐 pic.twitter.com/TzUce9pcyA
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025