సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున […]
ఐపీఎల్ ప్రాంచైజ్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గెలిస్తే ఫర్వాలేదు కానీ.. ఓడితే మాత్రం వెంటనే మైదానంలోకి వచ్చేస్తారు. కెప్టెన్‌ను అందరి ముందూ మందలిస్తారు. కోచ్‌లు ఉన్నా సరే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లపై మండిపడుతుంటారు. ఈ చర్యల కారణంగానే ఎల్ఎస్జీని కేఎల్ రాహుల్ వదిలివెళ్లాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ కెప్టెన్ జట్టును వీడినా.. సంజీవ్ గోయెంకా […]
గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.92,840గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.710, రూ.930 పెరిగిన విషయం తెలిసిందే. Also Read: PBKS VS LSG: లక్నో […]
ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎల్ఎస్జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. యానిమేటెడ్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను దిగ్వేష్ మ్యాచ్ ఫ్రీజులో 25 శాతం జరిమానాను విధించింది. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. దిగ్వేష్ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది. Also Read: IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ […]
వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఆరు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. బెంగళూరు తరఫున రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఐపీఎల్లో గేల్ 357 సిక్సర్లు బాదాడు, ఇది ఇప్పటికీ ఓ రికార్డు. అంతేకాదు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇప్పటికీ గేల్ (175) […]
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కింగ్ టెస్ట్, వన్డేలు ఆడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విరాట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్పటినుంచి అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ విరాట్ తాజాగా చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకూ తాను ఆడతానని […]
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, పిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది దాటినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. Also Read: BC Poru Garjana: న్యూఢిల్లీలో బీసీల పోరు గర్జన.. హాజరు […]
హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశలో మరో అడుగు పడింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘క్లియర్‌టెలిజెన్స్’ తన ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను తాజాగా హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ప్రారంభించింది. క్లియర్‌టెలిజెన్స్ సంస్థను తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఓవెన్ ఫ్రీవోల్డ్, మేనేజింగ్ పార్టనర్ అనీల్ భరద్వాజ్, హరికృష్ణ (డైరెక్టర్), ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి (నార్త్ కరోలినా), శ్రీధర్ సుస్వరం (జీఎం […]
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు […]