స్టార్ హీరోయిన్ సమంత చివరగా ‘ఖుషి’లో నటించారు. ఖుషి అనంతరం 1-2 వెబ్ సిరీసులు చేసిన సామ్.. నిర్మాణ సంస్థ స్థాపించారు. సమంత ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నుంచి మొదటి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమా టీజర్.. ఉగాది పర్వదినం సందర్భంగా రిలీజ్ అయింది. శుభం టీజర్ చూస్తుంటే.. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది.
Also Read: Heroine Sneha: అరుణాచలంలో స్నేహ అపచారం.. మండిపడుతున్న భక్తులు!
ఒక నిమిషం 56 సెకండ్ల నిడివి గల శుభం టీజర్.. శోభనం సీన్‌తో ఓపెన్ అవుతుంది. ‘మా వాడు అమాయకుడు, వెర్రోడు, పాపం వాడికి ఏమీ తెలియదు.. మొత్తం నువ్వే చూసుకోవాలని మీ అమ్మ చెప్పారు’ అనే అని కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి)తో శ్రీవల్లి (శ్రీయా) అంటుంది. ఆపై రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది శ్రీవల్లి. శోభనం గదిలోనే శ్రీవల్లి సీరియల్స్ చూస్తూనే ఉంటుంది. ఈ సమయంలో సీరియల్ చూడడం ఏంటి అని హర్షిత్ అనగానే.. ఉష్ అంటూ సీరియస్‍గా శ్రీవల్లి ట్విస్ట్ ఇస్తుంది. ‘పురుషుల్లో రెండు రకాలు’ అనే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.