లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. Also Read: Pregnant Woman: ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన […]
రాజమండ్రిలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో డెలివరీకి వెళ్ళిన గర్భిణి స్త్రీ అదృశ్యం కావడం కలకలం రేపింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళను చివరకు కాకినాడ జీజీహెచ్‌లో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? […]
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ కోసం నేడు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళిక చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో […]
నగల తయారీ, వినూత్న డిజైన్లతో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ‘ముకుంద జ్యువెల్లర్స్’ తన బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. సాంప్రదాయ భారతీయ డిజైన్ల నుంచి.. ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. ఇప్పటికే కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, సుచిత్ర, హనుమకొండ, ఖమ్మంలలో బ్రాంచ్‌లను కలిగి ఉంది. అయితే తాజాగా ముకుంద జ్యువెల్లర్స్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. […]
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూకి) చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో మరలా అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ […]
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న అజితేష్ (20) అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. వారాసిగూడలో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పినట్లు అజితేష్ తండ్రి రామకృష్ణకి విద్యార్థి స్నేహితులు చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడతో.. అజితేష్ తండ్రి ఈరోజు పోచారం పోలీసులకు పిర్యాదు చేశారు. తండ్రి పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. Also Read: […]
నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కొనసాగనున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది. Also Read: Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం! బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. […]
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2025-26 సీజన్లో గోవాకు ఆడాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) మంగళవారం యశస్వి లేఖ రాశాడు. యశస్వి నిర్ణయానికి ఎంసీఏ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీ కూడా మంజూరు చేసింది. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన విషయం తెలిసిందే. […]
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8 […]