ఐపీఎల్ 2025లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఈ మొదటి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై.. బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యం ఛేదించదగినదే అయినా.. చెన్నై 25 పరుగుల తేడాతో ఓడింది. శనివారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్ శంకర్ (69 నాటౌట్; […]
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ […]
మద్యం స్కాం కేసులో సీఐడీ నోటీసులను సవాలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు నిరాకరించింది. 164 స్టేట్మెంట్ ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరటంతో ఆ దిశగా నోటీసులు […]
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్‌లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది. […]
టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు: ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్‌పై […]
ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో […]
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి.. ఈరోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి […]
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘పరిపాలనా విధి విధానాలు అందరికి […]
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం మూడో పట్టణ పీఎస్‌కు తరలించారు. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు అనిల్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి అనంతపురంకు పోలీసులు తీసుకోచ్చారు. 2018లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో Cr No 156/2018 u/s 419 186 506 ఐపీసీ కింద బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు అయింది. ఐఏఎస్ అధికారి నంటూ అప్పటి […]
మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి: లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్ […]