నగల తయారీ, వినూత్న డిజైన్లతో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్ ‘ముకుంద జ్యువెల్లర్స్’ తన బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుంచి.. ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, సుచిత్ర, హనుమకొండ, ఖమ్మంలలో బ్రాంచ్‌లను కలిగి ఉంది. అయితే తాజాగా ముకుంద జ్యువెల్లర్స్ ఓ బంపరాఫర్ ప్రకటించింది.
Also Read: HCU: 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటాం.. ఎవరు కొన్నా నష్టపోతారు: కేటీఆర్
విజయవాడ ఎగ్జిబిషన్‌లో ముకుంద జ్యువెల్లర్స్ తన స్టాల్ ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు ముకుంద జ్యువెల్లర్స్ తన స్టాల్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఈ మూడు రోజుల్లో స్టాల్‌ను విసిట్ చేసి డైమండ్ నెక్లెస్ పొందే అవకాశం కల్పించింది. మీరు ఎలాంటి బిల్ చేయాల్సిన అవసరం లేదు. విషయం తెలిసిన వారు ఇప్పటికే ఎగ్జిబిషన్‌లోని స్టాల్‌ను సందర్శిస్తున్నారు. ఈ ఆఫర్‌ను అందరూ వినియోగించుకోవాలని ముకుంద జ్యువెల్లర్స్ యాజమాన్యం కోరుతోంది.