ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్ […]
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం […]
తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, పాజిటివ్ క్రికెట్ ఆడతాం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ తెలిపారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని చెప్పారు. గతంలో విజయం సాధించినా, ఓడినా సరే దానిని పక్కన పెట్టేయాలన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సైమన్ చెప్పుకొచ్చారు. సొంతగడ్డపై ఎస్ఆర్హెచ్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30కు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ […]
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో సవాల్‌కు సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమవుతున్న ఎస్ఆర్హెచ్ మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్నేసింది. వరుసగా రెండు విజయాలు సాధించిన జీటీ.. ఈ మ్యాచ్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 18వ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆరంభించింది. […]
శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది. Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’! తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో […]
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని […]
ఐపీఎల్ 2025లో విజయాలు లేక సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ప్రాంచైజీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ‘రెడీ టు రోర్’ అని క్యాప్షన్ ఇచ్చి.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో బుమ్రా సతీమణి సంజనా గణేశన్, కుమారుడు అంగద్‌ను చూపించారు. అంగద్‌కు తండ్రి బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి సంజనా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ […]
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం […]
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహరచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో మరోసారి పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కలిసి సుముఖత తెలిపారు. అయితే బీజేపీతో పొత్తుకు షరతులు విధించారు. Also Read: One Nation […]
2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు […]