AP News: రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ ప్రారంభం!
- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం
- స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని
- ఎవరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
‘పరిపాలనా విధి విధానాలు అందరికి అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వ్యాపారస్థులు, బిల్డర్లు అందరూ స్టేక్ హోల్డర్లుగా ఉండే రెవెన్యు శాఖలో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు జరిగింది. ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేస్కోవచ్చు. అమ్మకదారులు, కొనుగోలుదారులు, సాక్షులు.. ఇలా అందరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
’26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. 290 కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవసరం ప్రభుత్వానికి లేదు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకువస్తున్నాం. పారదర్శకంగా ఉండడం కోసమే మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నాం. భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాము. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి తగ్గేలా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా స్లాట్ విధానం అమలులోకి తేస్తున్నాము’ అని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు.
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!