పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది […]
త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్లో […]
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా […]
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండడంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని […]
ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా జరగనుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. […]
ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్‌సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్‌సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు […]
యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ […]
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్టన్కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్ […]
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల ఆర్యన్.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుని ‘అనయ బంగర్’గా మారారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనయ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గతంలో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పిన అనయ.. తాజాగా తన కొత్త ప్రయాణం ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందో చెప్పారు. తాజాగా లల్లాంటాప్లో […]
తాను చేతులెత్తి జోడిస్తున్నా అని, టీటీడీ గోశాలను ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, టీటీడీపై రాద్ధాంతం మానుకోండన్నారు. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. ఈ […]