యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు ఆటగాడిగానూ అప్పుడు రికార్డు సృష్టించాడు.
అతి పిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు ఇంతకుముందు రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) పేరిట ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగడంతో బర్మన్ రికార్డు బద్దలైంది. ఈ జాబితాలో ముజీబుర్ రెహ్మన్ (17 ఏళ్ల 11 రోజులు), రియాన్ పరాగ్ (17 ఏళ్ల 152 రోజులు), సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 182 రోజులు), వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 199 రోజులు), రాహుల్ చాహర్ (17 ఏళ్ల 247 రోజులు), అభిషేక్ శర్మ (17 ఏళ్ల 250 రోజులు), ఇషాన్ కిషన్ (17 ఏళ్ల 262 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్ల లిస్ట్:
# వైభవ్ సూర్యవంశీ (14 ఏళ్ల 23 రోజులు) – రాజస్థాన్ రాయల్స్, 2025
# ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2019
# ముజీబుర్ రెహ్మన్ (17 ఏళ్ల 11 రోజులు) – పంజాబ్ కింగ్స్, 2018
# రియాన్ పరాగ్ (17 ఏళ్ల 152 రోజులు) – రాజస్థాన్ రాయల్స్, 2019
# ప్రదీప్ సాంగ్వాన్ (17 ఏళ్ల 179 రోజులు) – ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2008
# సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 182 రోజులు) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2015
# వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 199 రోజులు) – రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017
# రాహుల్ చాహర్ (17 ఏళ్ల 247 రోజులు) – రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017
# అభిషేక్ శర్మ (17 ఏళ్ల 250 రోజులు) – ఢిల్లీ క్యాపిటల్స్, 2018
# ఇషాన్ కిషన్ (17 ఏళ్ల 262 రోజులు) – గుజరాత్ లయన్స్, 2017