హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సూపర్ హిట్ మూవీ ‘అవతార్’ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ హీరోలకూ అంటుకుంది. అవతార్ క్యారెక్టర్లతో కలిసి సెల్ఫీలు దిగిన పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్లు, ప్రత్యేక ఈవెంట్లు లేదా థీమ్ ఆధారిత కార్యక్రమాల్లో భాగంగా హీరోలు అవతార్ రూపాలతో ఫోటోలు దిగుతున్నట్లు కనిపిస్తున్న ఈ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోటోలు నిజమైనవి కాదు. వీటన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో క్రియేటర్లు రూపొందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో క్రియేటర్లు ఊహకు అందని విధంగా కొత్త తరహా కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అలాంటి ఒక ఫన్నీ AI వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అవతార్’ హీరో జేక్ సల్లి మన ఇండియన్ స్టార్ హీరోలతో సెల్ఫీలు దిగితే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ వీడియోను రూపొందించారు. అత్యాధునిక AI టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో జేక్ సల్లి… మహేశ్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా దగ్గుబాటి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సౌత్ ఇండియన్ దిగ్గజ హీరోలతో పాటు కన్నడ స్టార్ యశ్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రణబీర్ కపూర్ తదితర ప్రముఖ నటుల ఫేమస్ సినిమా క్యారెక్టర్లతో సరదాగా సెల్ఫీలు దిగుతున్నట్లు చూపించారు. ప్రతి సెల్ఫీ కూడా ఆయా హీరోల ప్రత్యేక స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్‌కు తగ్గట్టుగా ఉండటం ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ AI వీడియో సినీ అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Insane AI edit
Jake Sully taking selfie with Indian heros#avatar #MaheshBabu #AIselfie #AIart pic.twitter.com/uS0Z9mu9lg
— WorthvieW (@worthview) December 18, 2025