మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండడంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెండున్నర కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూల్ విజయ సంకల్ప యాత్ర సభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ పరిచయం చేసుకున్నారు.