Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup India T20 World Cup 2026 Squad Announcement Tomorrow

T20 World Cup 2026: రేపే T20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ప్రకటన.. తుది జట్టులో గిల్, శాంసన్?

Published Date :December 19, 2025 , 8:05 am
By Chandra Shekhar Pamena
  • ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్..
  • రేపు భారత జట్టును ఎంపిక చేయనున్న సెలక్షన్ కమిటీ..
  • ప్రపంచ కప్కి ముందు టీమిండియాను కలవర పెడుతున్న గిల్, సూర్య ఫామ్..
  • భారత తుది జట్టులోకి సంజూ శాంసన్ ని తీసుకుంటారా..?
T20 World Cup 2026: రేపే T20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ప్రకటన.. తుది జట్టులో గిల్, శాంసన్?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రేపు ( డిసెంబర్ 20న) భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు ఇంకా ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ప్రకటించే జట్టే మెగా టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్ ఆటగాళ్ల ఫాంతో పాటు సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.

Read Also: Bangladesh: దారుణం.. హిందూ వర్కర్‌ని చంపి.. చెట్టుకు కట్టేసి తగులబెట్టిన ముస్లింలు!

Also Read

  • T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
  • Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్‌ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్..
  • Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
  • Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Add as a preferred
source on google

అయితే, ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన ఆందోళనగా శుభ్‌మన్ గిల్‌, సూర్యకుమార్ యాదవ్‌ల ఫామ్ మారింది. జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు ముందు అతనికి తిరిగి అవకాశం కల్పిస్తారా అనే ఆసక్తి నెలకొంది.

Read Also: This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

ఇక, వికెట్‌కీపర్‌ విభాగంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆసియా కప్‌ 2025 నుంచి జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లు కీపర్లుగా కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్ నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్ రాలేదు.. అయితే, శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎడాపెడా మార్చి చివరకు ప్లేయింగ్ ఎలెవన్ నుంచే తొలగించారు. దీంతో ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్‌లకు మళ్లీ టీ20ల్లో అవకాశం కల్పించే ఆలోచన సెలెక్టర్లకు ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ డిసెంబర్ 2023 తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్న అతడు వరల్డ్‌కప్ అవకాశాలు అనిశ్చితంగా మారాయి.

Read Also: Astrology: డిసెంబర్‌ 19, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

అలాగే, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రింకు సింగ్ ను పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్‌గా ఉన్న రింకు, వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌ను కోల్పోతాడా అనే చర్చ సైతం జరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం భారత జట్టు ఎంపికపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajit Agarkar press conference
  • India T20 World Cup 2026 squad
  • Indian cricket team updates
  • Sanju Samson T20 World Cup
  • Shubman Gill selection

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions