నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పీఏసీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 33 మందిని పీఏసీ […]
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ […]
నేడు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగవ రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నేడు నిర్ణయం.. నామినేషన్ పత్రాల దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ […]
తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అర్జెంట్‌గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపిందని, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను […]
హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరుస్తుందన్నారు. అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్ […]
2024-2025 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు ఇటీవల అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి బీసీసీఐ కాంట్రాక్టులో ఛాన్స్ […]
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. మూసీ ప్రక్షాళణ పేరుతో ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ కాంగ్రెస్ […]
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న […]
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి.. ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి […]