అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో మాజీ NASCAR డ్రైవర్ గ్రెగ్ బిఫిల్ (55), అతని భార్య క్రిస్టినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల కుమార్తె ఎమ్మా, ఐదేళ్ల కుమారుడు రైడర్‌గా గుర్తించారు.

ప్రమాదానికి కారణమిదే..
విమానం బయల్దేరే సమయంలోనే వాతావరణం అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. స్టేట్స్‌విల్లే విమానాశ్రయం చుట్టూ వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. అయినా కూడా విమాన ప్రయాణం ప్రారంభించినట్లు నివేదిక అందుతోంది. విమానం టేకాఫ్ అయిన 10:00 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షం పడిందని అక్యూవెదర్ డేటా చూపించింది. బయలుదేరిన 15 నిమిషాల్లోనే విమానం విమానాశ్రయానికి తిరిగి రావడానికి ప్రయత్నించి. 10:15 గంటల ప్రాంతంలో రన్‌వేపై కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి.

అయితే కూలిపోయిన విమానం బిఫిల్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. NASCAR బృందాలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు తరచుగా ఉపయోగించే విమానాశ్రయంలోనే విమానం కూలిపోయింది. బిఫిల్ కుటుంబ సభ్యులంతా చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు.

బిఫిల్‌కు మంచి పేరు ఉంది. ఇతరులకు సహాయం చేస్తాడని అతని స్నేహితులు చెప్పారు. బాఫిల్ గొప్ప NASCAR ఛాంపియన్. లక్షలాది మంది అభిమానులను థ్రిల్ చేశాడు. తొలుత రేసింగ్ కెరీర్‌తో ప్రారంభించాడు. అనంతరం NASCAR హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ అయ్యాడు. NASCARలో 75 మంది గొప్ప డ్రైవర్లలో బిఫిల్ ఒకడు కావడం విశేషం. 1998లో NASCAR క్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రక్ సిరీస్‌లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో సిరీస్ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. 2001లో NASCAR Xfinity సిరీస్‌లో రూకీ ఆఫ్ ది ఇయర్ గౌరవాలను పొందాడు. 2002లో ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. NASCAR ప్రకారం రెండు సిరీస్‌లలోనూ టైటిళ్లను గెలుచుకున్న మొదటి డ్రైవర్‌గా బిఫిల్ నిలిచాడు.
PLANE CRASH AT NORTH CAROLINA AIRPORT:
– Statesville Regional Airport
– Large fire and smoke seen
– 6 people onboard, 5 deceased
– Plane owned by American race car driver Greg Biffle
– Local radio station says he, his wife and children onboard (unconfirmed)
– No word on cause of… pic.twitter.com/9mcuFzlRlg— AZ Intel (@AZ_Intel_) December 18, 2025
BREAKING: New video captures the plane crash in Statesville, North Carolina, which killed 7 people, including former NASCAR driver Greg Biffle, his wife and children. pic.twitter.com/xM2DR4xCox
— AZ Intel (@AZ_Intel_) December 18, 2025
❗️⚠️🇺🇸 – A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.
The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm
— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025