ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొత్తంగా చూస్తే గోల్డ్ రేట్స్ పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తులోనే పసిడి ధరలు ఉంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి సామాన్య ప్రజలు తప్పక కొనాల్సి వస్తోంది. అయితే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.400 తగ్గింది. […]
నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దాంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల […]
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ […]
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై జరగనున్న సెమినార్లో ముఖ్యఅతిథిగా అయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర రాజన్ నేతృత్వంలో ఈ సెమినార్ ఏర్పాటైంది. Also Read: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం […]
ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం […]
ఐపీఎల్ 2025లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పట్టికలో 17 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు టాప్-2లో స్థానం […]
గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరులోని డీటీసీకి పోలీసులు తీసుకొచ్చారు. రేపు వెంకటగిరి మేజిస్టేట్ ముందు కాకాణిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్లో గత ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ […]
యువ ఆటగాళ్లను చూస్తుంటే తనకు వయసు అయిపోయింది అని అనిపిస్తోందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ తన కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలానే అనిపించిందన్నాడు. ఆండ్రీ సిద్ధార్థ్ తన కంటే సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడని తెలిసిందని, దీంతో తాను చాలా పెద్దవాడిని అయిపోయాననిపిస్తోందని ధోనీ చెప్పుకొచ్చాడు. 1981లో జన్మించిన మహీ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. వచ్చే జులై 7కి 44వ పడిలోకి అడుగెడతాడు. ఐపీఎల్ […]
టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?: తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి […]
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం […]