ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై జరగనున్న సెమినార్‌లో ముఖ్యఅతిథిగా అయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర రాజన్ నేతృత్వంలో ఈ సెమినార్ ఏర్పాటైంది.
Also Read: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
దిల్లీఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం పవన్ చెన్నై చేరుకున్నారు. ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పవన్‌కు చెన్నై విమానాశ్రయంలో తమిళిసై సౌందరరాజన్, పలువురు రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక పవన్ కల్యాణ్ బసచేసే హోటల్ వద్ద తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్, పలువురు బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.