MS Dhoni IPL Retirement: రిటైర్మెంట్‌పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
- నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది
- బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా
- రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం, తిరిగి వస్తున్నానని చెప్పడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం లేదని, అలాగని వచ్చే ఏడాది ఆడుతానని కూడా చెప్పడం లేదని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు తొందరేమీ లేదు. ప్రతి సంవత్సరం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ కాబట్టి ఫిట్‌నెస్ ఉత్తమంగా ఉండాలి. క్రికెటర్లు పెర్ఫామెన్స్ కారణంగా రిటైర్ కావాల్సి వస్తే.. కొందరు 22 సంవత్సరాల వయస్సులో రిటైర్ అవుతారు. ఇక్కడ మీరు ఎంత పరుగుల దాహంతో ఉన్నారు, ఎంత ఫిట్‌గా ఉన్నారో ముఖ్యం. మీరు జట్టుకు ఎంత సహకరించగలరు, జట్టుకు మీరు అవసరమా అనేది కూడా ముఖ్యమే. నాకు తగినంత సమయం ఉంది. కొంతకాలంగా ఇంటికి వెళ్లలేదు, రాంచీకి తిరిగి వెళ్తాను. నేను కొన్ని బైక్ రైడ్‌లను ఆస్వాదిస్తాను. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాను. నేను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం, అదే సమయంలో తిరిగి వస్తున్నానని చెప్పడం లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఐపీఎల్ 2025ని చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. లీగ్ చివరి మ్యాచ్‌లో చెన్నై ముందుగా 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!