ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స, ప్రసవం అంటే చాలా మంది భయపడిపోతుంటారు. ప్రభుత్వ వైద్యంపై ఇప్పటికీ కొందరిలో చిన్న చూపు కూడా ఉంది. అక్కడ వైద్య సౌకర్యాలు సరిగా ఉండవని, డాక్టర్లు సరిగా పట్టించుకోరని జనాలు అంటుంటారు. అయితే కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తుంటారు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ తన భార్య ప్రసవంను ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించి.. జనాల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు. Also Read: KTR: ఎన్డీఎస్ఏ […]
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లోనే అని విమర్శించారు. ఎన్ని కుట్రలు సృష్టించినా.. ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందన్నారు. అశాస్త్రీయ ఆరోపణలను ఎల్ అండ్ టీ ఖండించండం సంతోషమన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, కేసీఆర్ గారు దూరదృష్టి గల […]
వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత […]
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజీయం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అపరేష్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజీయం ఓకే చెప్పింది. ఆయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ రామచందర్ రావు హైదరాబాద్ వాసి. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రాంచందర్ రావు […]
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దాంతో మొత్తంగా గత నాలుగు రోజులుగా పసిడి రేట్స్ పెరగలేదు. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,350గా.. 24 క్యారెట్ల ధర రూ.97,480గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. Also Read: Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే నేను ఈస్థాయిలో […]
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పున:ప్రతిష్ట మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. 4 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయలను కేటాయించారు. పున:ప్రతిష్ట కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే […]
సిర్పూర్లో నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడి హట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మంగళవారం సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను కోనప్ప స్వీకరించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తుమ్మడి హట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు, వారి అనుచరులు సిద్దమయ్యారు. అయితే కాగజ్ నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మడి హట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు […]
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్‌ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లను గత నెలలో వారి […]
ఐపీఎల్ 2025లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్) , విరాట్ కోహ్లీ (54)లు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్-2లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫయర్ 1లో […]
తెలంగాణ పోలీసులను ఓ రిమాండ్ ఖైదీ బురడీ కొట్టించాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే.. పోలీసుల కండ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులను డీటెయిల్స్ అడిగి పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల సబ్ జైలులో పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ రిమాండ్ […]