ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఓ ఐటీ ఉద్యోగిని కిరాణా సామాగ్రి డెలివరీ ఇచ్చిన అనంతరం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేయగా.. పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మడిపాక్కంకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్ […]
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు […]
హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నేడు ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ జరగనుంది. మధురైలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్త సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు హిందూ మున్నణి సంస్థ అధ్యక్షుడు కాడేశ్వర సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భక్త సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి దిన ఫలాలు మీకోసం. కింది వీడియోలో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు తెలుసుకోండి?.
వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయిలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం’ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా? అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు. పవన్ గురించి శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు […]
పీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సిబ్బంది నియామకం కంటే ముందే.. వందల సంఖ్యలో రిటైర్మెంట్లు పెద్ద సమస్యగా మారింది. పాత బస్సులకు రంగులేసి సిద్ధం చేసుకోవడంలో తలమునకలైన ఏపీఎస్ఆర్టీసీకి సిబ్బంది కొరత భారీగా ఎదరవనుంది. ఏపీఎస్ఆర్టీసీలో జూన్, జులై నెలల్లో పదవీ విరమణకు సుమారు 900 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొత్త సిబ్బందిపై అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. Also Read: Pawan Kalyan: సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి.. వైఎస్ జగన్‌కు […]
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరు అయినా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు. […]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద కారు ఢీకొని మృతి చెందిన వెంగళాయపాలెంకు చెందిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమాలు పరామర్శించారు. అనంతరం వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సింగయ్యను ఢీకొట్టిన వాహనం వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రధాన […]
వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ […]
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దాంతో సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, 8 మంది టీడీపీ కార్పోరేటర్లు, అధికారులు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వేచి ఉన్నారు. మరోవైపు మేయర్ చాంబర్లో వైసీపీకి చెందిన 39 మంది కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశలో సందిగ్దత నెలకొంది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే […]