పీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సిబ్బంది నియామకం కంటే ముందే.. వందల సంఖ్యలో రిటైర్‌మెంట్లు పెద్ద సమస్యగా మారింది. పాత బస్సులకు రంగులేసి సిద్ధం చేసుకోవడంలో తలమునకలైన ఏపీఎస్ఆర్టీసీకి సిబ్బంది కొరత భారీగా ఎదరవనుంది. ఏపీఎస్ఆర్టీసీలో జూన్, జులై నెలల్లో పదవీ విరమణకు సుమారు 900 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొత్త సిబ్బందిపై అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి.. వైఎస్ జగన్‌కు పవన్ కౌంటర్!
రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుల అమలు కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది. ఇంతలో ఒకేసారి 900 మంది పదవీవిరమణ చేయడానికి సిద్దమ్మయ్యారు. అందులో అత్యధిక శాతం మంది కండక్టర్లు, డ్రైవర్లు కావడం ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొన్ని సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు డ్రైవర్లు, కండక్టర్లు నియామకం కోరుతూ అర్జీలు పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు అమలుకు సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పుడు సిబ్బంది కొరత మొదలైంది. ఉచిత బస్సులు నిర్వహణకు ఇప్పటికే 10 వేల మంది సిబ్బంది నియామకం ప్రతిపాదనలు యూనియన్లు ఇచ్చాయి. ఇప్పటికే సిటీ బస్‌లను ఆన్ కాల్ డ్రైవర్లు నడుపుతున్నారు.