టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను జూన్ 24 నుంచి 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుత్యేంద్రబాబు, ఓబిలి నాగరాజును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి నిందితులు నలుగురిని పోలీసులు విచారించనున్నారు. Also Read: Operation Sindhu: ఇరాన్ […]
ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణ సంక్లిష్ట రూపం దాల్చిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ సింధు’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం విదేశాంగశాఖ ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో రెండు […]
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. టీమిండియా ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మ్యాచ్ మూడో రోజైన ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్‌లను మనోళ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా గత ఐదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ప్రస్తుతం టీమ్ మొత్తం యువ ఆటగాళ్లతో ఉందని, […]
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన […]
ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా […]
ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి భార్య గీతా బాస్రా హోస్ట్ చేసిన ‘హూ ఈజ్ ది బాస్ వైటీ’ అనే టాక్ షోలో రోహిత్ సతీసమేతంగా పాల్గొన్నాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ ఈ షోలో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ20) మ్యాచ్ సందర్భంగా తాను టాస్ గెలిచి […]
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనలో శక్తి ఉన్నంతవరకూ క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు. ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ తర్వాత విషయాలు దేవుడికి వదిలేస్తాను అని తెలిపాడు. తన గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేనని బుమ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆట అనంతరం బుమ్రా మాట్లాడాడు. అంతర్జాతీయ […]
గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇటీవల లకారంకు చేరుకున్నాయి. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. శనివారం పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.60 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 […]
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84 రోజుల అనంతరం, 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. ఎమ్రిట్ 396 మ్యాచ్‌ల (10 ఏళ్ల 337 రోజులు) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ […]
తన సతీమణి రితిక సజ్‌దేశ్‌కు చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసినట్లు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్ ప్రారంభించిన ప్రాంతానికి రితికను తీసుకెళ్లి.. పిచ్‌పై మోకాలిపై కూర్చొని తన ప్రేమను తెలియజేసినట్లు చెప్పాడు. ఆ క్షణాలను కెమెరాలో బంధించామని, రితికనే తన అదృష్ట దేవత అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి […]