జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓ ఓవర్లో ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడని, ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం అని డకెట్ ప్రశంసించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 465 పరుగులకు […]
వన్డే ప్రపంచకప్ 2003కి ఎంపిక చేయకపోవడంతో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తనతో 3 నెలలు మాట్లాడలేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. లక్ష్మణ్ చాలా నిరాశకు గురయ్యాడని, కొన్ని రోజుల తర్వాత అతనితో రాజీ చేసుకున్నా అని చెప్పారు. ప్రపంచకప్ ముగిసాక భారత జట్టు ప్రదర్శన పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడని దాదా పేర్కొన్నారు. ప్రపంచకప్ 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్.. రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మెగా […]
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సులు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశారు. క్రికెట్‌తో బిజీగా ఉన్న కారణంగా రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. అయితే టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి మాత్రం తాను సిద్ధమని దాదా తెలిపారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఫిట్‌గా ఉండటం, భారత జట్టులో చోటు సంపాదించడం సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అంత సులువు కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా […]
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీశారు. నలుగురిలో ఇద్దరు మరణించారు. Also Read: Pawan Kalyan: మధురై చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. పంచెకట్టులో..! కారు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్ […]
ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. క్రీడల్లో మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన కోచ్‌లు కీచకులుగా మారారంటూ క్రీడాకారిణులు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వేదింపులు నిజమేనని నిర్ధారించారు. Also Read: Kurnool District: బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే! ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఉన్న శాయ్ హాస్టల్లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు […]
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్, […]
ఎన్టీఆర్, వైఎస్ఆర్ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న […]
తమిళనాడులో కార్తికేయుడి భక్తులతో నేడు బీజేపీ నిర్వహిస్తూన్న మురుగన్ మహా భక్త సమ్మేళనం రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దానికి కారణం అయ్యింది. అమ్మ తిడల్, పాండికొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఎన్నికలకు ఎడాది ముందుగానే సై […]
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో జూన్ 26 నుంచి జూలై 4వ తారీకు వరకు ‘వారాహి నవరాత్రులు’ నిర్వహించనున్నారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆషాడ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహా మండపంలోని ఆరవంతస్తులో అమ్మవారి ఉత్సవం మూర్తిని ప్రతిష్టించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆషాడ సారె సమర్పణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఈవోతో ఆలయ వైదిక కమిటీ, అర్చకులు చర్చించారు. వారాహి అమ్మవారి నవరాత్రులు, ఆషాడం మాస […]