ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం.. హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి’ కార్యక్రమం.. సాయత్రం 5 గంటలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు నేడు ఏలూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన.. ఎమర్జెన్సీ డే విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఏర్పాటు […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం. కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా.. మిర్చి యార్డులో పర్యటించారని కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. Also Read: Pawan Kalyan: పోటీ […]
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్‌ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా […]
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లను […]
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమదులు పంచాయతీలోని గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండోవ రోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో 2017 సంవత్సరంలో కుదుర్చుకొన్న ఎంఓయు ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ప్రారంభం అయింది. అయితే కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో పవన్ వేంటనే కేబినెట్ నుంచి బయల్దేరారు. సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. Also Read: Crime News: పెందుర్తిలో పెను […]
ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో […]
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు భారీ స్థాయిలో దిగొచ్చింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. ఈరోజు రూ.750 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై వరుసగా రూ.60, రూ.820 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,550గా.. 24 […]
ఏపీలోని అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద (30) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అన్నా క్యాంటీన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శివానంద తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Chevireddy Bhaskar Reddy: నోటీసులపై స్పందించని చెవిరెడ్డి.. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న విజిలెన్స్! గార్లదిన్నె […]