ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్ […]
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత పిటిషన్‌ను గురువారం (జూన్ 26) విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు. Also Read: CM Chandrababu: హైదరాబాద్ కంటే.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం! వైఎస్ జగన్ […]
హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’ అనేది ప్రధాని మోడీ లక్ష్యం అని, అలాగే ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్’ అనేది మన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో […]
ఎమ్మెల్యే అనుచరుడి అడియో కలకలం: చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడి గ్రానైట్ దందా సంబంధించిన ఆడియో కలకలం రేపింది. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడు హారీష్ యాదవ్ తో సంతనూతలపాడుకు చెందిన గ్రానైట్ క్వారీ యాజమాని వెంకటేశ్వర్ రెడ్డి వద్ద యాబై లక్షలు తీసుకుని పనులు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గ్రానైట్ యాజమాని. కార్వేటినగరము నగరం మండలంలోని గ్రానైట్ ప్యాక్టరీ కోసం ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యే […]
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. దాంతో కొనుగోలు దారులు గోల్డ్ కొనాలంటేనే భయపడిపోయారు. అయితే గోల్డ్ రేట్లు మూడు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.250 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (జూన్ 25) 24 క్యారెట్ల […]
పదకొండేళ్ల క్రింత ఏర్పాటైన కొత్త రాష్ట్రం తెలంగాణ. అభివృద్ధి, జీడీపీ విషయంలో దేశానికి తలమానికంగా ఉన్న రాష్ట్రం. కానీ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ పరువు తీసింది. మావోయిస్టుల పేరు చెప్పి వందల మంది ఫోన్లు ట్యాప్ చేయడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. కానీ మరింత లోతైన విచారణ కోసం.. ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో […]
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి […]
నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత: ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన […]
అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు నిన్న దారుణహత్యకు గురయ్యాడు. నేడు అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Also Read: Outsourcing Staff: ఉద్యోగుల నియామకాలపై మంత్రుల బృందం ఆరా.. వారంలో మరోసారి […]
ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. విద్యాశాఖ చాంబర్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. Also Read: […]