గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇటీవల లకారంకు చేరుకున్నాయి. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. శనివారం పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.60 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,690గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,300గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,690గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,450గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,840గా నమోదైంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
Also Read: Karun Nair: తొలి టెస్టులో డకౌట్.. అయినా కరుణ్ నాయర్ వరల్డ్ రికార్డు!
మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. వరుసగా పెరిగిన వెండి.. మూడు రోజులుగా స్థిరంగా ఉంటోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,10,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 20 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్ష 10 వేలుగా కొనసాగుతోంది.