UPI Creates History : భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2025 ఏడాదిని ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) సరికొత్త రికార్డులతో ముగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాది యూపీఐ లావాదేవీలు విలువ , సంఖ్య పరంగా ఆల్-టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. 2025 ఏడాది మైలురాళ్లు: 2025 మొత్తం క్యాలెండర్ ఇయర్ పరిశీలిస్తే, యూపీఐ వ్యవస్థ […]
Aadi Srinivas : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, అవినీతిని ముఖ్యమంత్రి ఎండగట్టడంతో కేటీఆర్, హరీష్ రావులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ […]
భారత్ కూడా అమెరికా వెనిజువెలాను చేసినట్లు చేయాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు.. వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారకాస్‌లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. డ్రగ్ […]
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల క్రెడిట్ , నీటి కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు తీరును , బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తుంటే, అన్నీ తనకే […]
గత వారంలో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 0.84% పెరిగి 85,762 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.09% పెరిగి 26,328 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఈ ర్యాలీలో కొన్ని చిన్న కంపెనీల షేర్లు (Small-cap/Penny stocks) పెట్టుబడిదారులకు భారీ రిటర్న్స్‌ను అందించాయి. ఆ 5 స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి: 1. హింద్ అల్యూమినియం ఇండస్ట్రీస్ (Hind Aluminium Industries) ఈ షేర్ గత వారంలో ఏకంగా 91.54% రిటర్న్స్‌ను అందించింది. వారం ప్రారంభంలో […]
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు. అసలేం జరిగింది? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా, […]
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ సెగ రాజుకుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు భారీ ఎత్తున తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో ప్రజా గొంతుక వినిపించాల్సిన బాధ్యతను […]
ఆ సీనియర్ మినిస్టర్ ముందు చూపు మామూలుగా లేదా? అసలు ఆలోచనేంటో అర్ధమైన కొందరు వావ్…. వాటే స్కెచ్. ఈయన మామూలోడు కాదంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారా? సార్…. చాలా దూరం ఆలోచించే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఏపీ మంత్రివర్యులు? సొంత పార్టీ వాళ్ళ ముందరి కాళ్ళ బంధాలు ఎందుకు వేస్తున్నారు? 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి కేబినెట్ బెర్త్ పట్టేశారు ఆనం రామనారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ […]
మీరు ఒక బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే, ఇప్పుడు మీకు సరైన సమయం. ప్రీమియం ఫీచర్లతో అలరిస్తున్న వివో X100 ప్రో ధరను అమెజాన్ భారీగా తగ్గించింది. లాంచ్ సమయంలో అధిక ధర ఉన్న ఈ ఫోన్, ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ధర , ఆఫర్ వివరాలు : వివో X100 ప్రో (16GB RAM + 512GB స్టోరేజ్) వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 82,999 వద్ద లిస్ట్ చేయబడింది. అయితే, […]
వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి? వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా […]