TG EdCET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల..
- ఫిబ్రవరి 23 నుండి దరఖాస్తుల ప్రారంభం
- అపరాధ రుసుముతో అప్లై చేసే గడువు వివరాలు
- మే 12న రెండు సెషన్లలో ప్రవేశ పరీక్ష
- మే 15న కీ.. మే 30న తుది ఫలితాల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EdCET 2026 : తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ (B.Ed) కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక TG EdCET-2026 నోటిఫికేషన్‌ను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ, దరఖాస్తుల ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థుల సౌకర్యార్థం అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. రూ. 250 ఫైన్‌తో ఏప్రిల్ 23 వరకు, రూ. 500 ఫైన్‌తో ఏప్రిల్ 27 వరకు , రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులను అనుమతించనున్నారు.
Mudragada Padmanabham: అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ..
ఇక పరీక్షా నిర్వహణ విషయానికి వస్తే, మే 12వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా టీజీ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఉదయం , సాయంత్రం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే అంటే మే 15న అధికారులు ప్రాథమిక కీని విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించిన అనంతరం, మే 30వ తేదీన తుది ఫలితాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Prabhas :’ఫౌజీ’ 70% షూటింగ్ పూర్తి.. ఆ 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌తో బాక్సాఫీస్ షేక్!
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!