సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి అంగన్వాడి టీచర్లు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది.
రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని […]
కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు.
మాజీ సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టంగా డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం పలు నెలలుగా పోరాడుతూ ఉన్న పెండింగ్ బిల్లుల మంజూరుపై ప్రెస్ ద్వారా స్పందిస్తూ, వారు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు వ్యతిరేకంగా స్పందించి, అనేక ప్రాంతాలలో మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ మొదలవుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశామన్నారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు.. ఎలాంటి […]