టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు ఫిక్స్ అయ్యారా? పర్సనల్ ఇమేజ్‌తో పాటు పార్టీని నిలబెట్టడానికి అదే కరెక్ట్ మెడిసిన్ అని క్లారిటీకి వచ్చేశారా? కానీ… అంతకు మించి ఆయన ఇంకేదో ఆశిస్తున్నారన్న విశ్లేషణల్లో వాస్తవం ఉందా? పైకి చెప్పేవన్నీ కాదు, అసలు సీక్రెట్ అదేనన్న వాదన ఎందుకు బలపడుతోంది? కేటీఆర్ పాదయాత్ర సెంట్రిక్‌గా…. సీక్రెట్స్ పేరుతో జరుగుతున్న కొత్త చర్చ ఏంటి? రాజకీయ నాయకుల పాదయాత్రల పరంపరలో మరో కొత్త టూర్ మొదలవబోతోందా అంటే… యస్ […]
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోళ్ళకు 30 వేల కోట్ల అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొనుగోళ్లకై 20 వేల కోట్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు.
మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ - శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం - కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs - చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ - పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ - హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు - ఫోర్త్ సిటీ రానున్నాయి.
ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 […]
మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ మాట్లాడుతూ.. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని, రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు.