అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. […]
రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు […]
సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సందర్శించారు.
కంటోన్మెంట్ బంజారానగర్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్యాయంకి, దుర్మార్గంకి వ్యతిరేకంగా కొట్లాడడమే నా వ్యక్తిత్వమన్నారు.
Ponguleti Srinivas Reddy : వరంగల్ భద్రకాళి బండ్, భద్రకాళి ఆలయం లో చేపట్టనున్న అభివృద్ధి పనులను జిల్లా ఉన్నత అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. దశాబ్దాల కాల మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అవాంతరాలు తొలిగిపోయాయని, కేంద్రం అనుమతి ఇస్తే ఎయిర్ […]
ఉమ్మడి ప్రకాశం వైసీపీలో భారీ మార్పులే జరగబోతున్నాయా? ఆ దిశగా పార్టీలో కసరత్తు జరుగుతోందా? ఎన్నికల టైంలో నియోజకవర్గాలు మారిన నేతలు కొత్త స్థానాలు మాకొద్దు బాబోయ్…. అని మొత్తుకుంటున్నారా? అలా సేఫ్ జోన్ వెదుక్కుంటున్న నాయకులు ఎవరు? జిల్లాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా… మిగతా 11 చోట్ల కొత్త అభ్యర్థుల్నే బరిలో దింపింది వైసీపీ. కానీ… కేవలం దర్శి, యర్రగొండపాలెంలో మాత్రమే గెలవగలిగింది. […]