Nara Lokesh : పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (PTM)లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతూ మంత్రి నారా లోకేష్ లేఖ విడుదల చేశారు. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
Beerla Ilaiah: ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..
ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ…సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా..అంతా ఒకే పాఠశాలలో కాకుండా, వారి వారి గ్రామాల పాఠశాలల్లో జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చని నారా లోకేష్ అన్నారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం.. విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యం. పేరెంట్- టీచర్ మీటింగుకి హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని, పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
IFFI 2024 Winners: అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. విజేతలు వీరే