ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనికి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. ఆమె ప్రధాని భద్రతా బృందం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చ పెట్టారు. దీంతో ప్రధాని మోడీ భద్రత వలయంలో మహిళా కమాండో ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఫోటో వైరల్ కావడంపై భద్రతా వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఎస్పీజీలో 100 మంది మహిళా కమాండోలు ఉన్నారు.. అలాగే, మరి కొందరు మహిళా ఎస్‌పీజీ కమాండోలు ‘క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్’లో సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.
బుకింగ్ చేసిన రైలు టికెట్లో పేరును ఎలా మార్చుకోవాలంటే?
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది వారి గమ్య స్థానాలను చేరుకోవడానికి ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని నివారించడానికి చాలామంది ప్రయాణికులు రైలులోని రిజర్వ్ చేసిన కోచ్‌లలో టిక్కెట్లను బుక్ చేసుకోని ప్రయాణం చేస్తారు. రైలులో రిజర్వేషన్‌ను బుక్ చేస్తున్నప్పుడు, చాలా సార్లు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో చూపించడం సహజమే. చాలామంది తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవడమే ఇందుకు గల కారణం. అయితే ఇలా చేయడం ద్వారా వారు కన్ఫర్మ్ సీటు పొందవచ్చు. కానీ, ప్రయాణానికి ముందు ప్రజల ప్రణాళికలు మారడం చాలాసార్లు మారుతుంటాయి. ఈ సందర్భాల్లో ప్రజలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో టిక్కెట్‌ను కూడా రద్దు చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని చార్జెస్ పోను దానిపై మీరు డబ్బును వాపసు పొందుతారు. కానీ, మీకు కావాలంటే మరొక పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు.
మంత్రి నారాయణ అధ్యక్షతన నేడు ఏపీ సబ్ కేబినెట్ సమావేశం
నేడు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశం సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, అమరావతిరైల్వే లైన్ భూసేకరణ అంశం ఈ సమావేశంలో చర్చకు వస్తుంది. సిఆర్‌డిఏ భూ కేటాయింపులపై కూడా ఈ ఉపసంఘం చర్చించనుందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా, త్వరలో భవనాల కోసం టెండర్లు పిలవడం మరియు భూ కేటాయింపులపై సమగ్ర చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, టీజీ భరత్, సంధ్యారాణి, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు.
తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు, స్వెటర్లు కప్పుకుని రోజువారీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రబీ సాగు కోసం ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల..!
గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలువలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2024- 25 రబీ సీజన్ లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8 లక్షల 96 వేల 507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవసరాలకు నీటిని అందిస్తారు. తూర్పు డెల్టాకు 2 లక్షల 64 వేల 507 ఎకరాలు, పశ్చిమ డెల్టాకు 4 లక్షల 60 వేలు ఎకరాలు, సెంట్రల్ డెల్టా కోనసీమకు లక్షా 72 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయనున్నారు . ప్రస్తుతం గోదావరి నదిలో 91 పాయింట్ 3,5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రబీ ఆయకట్టుకు గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని కడియం, అనపర్తి, బిక్కవోలు మండలాలకు గోదావరి పశ్చిమ డెల్టా పరిధిలో కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు నీరు అందించాలని నిర్ణయించారు.
నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..
ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు CWC సమావేశం కానుంది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి CWC సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరా రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు సభకు హాజరుకానున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్నప్పటికీ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది, తప్పులు ఎలా సరిదిద్దాలి అన్నది కూడా చర్చకు వస్తుందని అర్థమవుతోంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..
యాదాద్రి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే తనిఖీల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. రెగ్యులర్ ఇంజక్షన్ బాక్స్ లో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజక్షన్ వుండటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ను రెగ్యులర్ మెడిసిన్ బాక్స్ లో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజక్షన్ ఎందుకు ఉంచారని వైద్యులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు ఎలా కాపాడుతారు? అని మండిపడ్డారు.
ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులపై నమ్మకంతో రోగులు వస్తే.. ప్రాణాలు హరించే విధంగా వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడే విధంగా వైద్యలు, సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. డేట్ ముగిసిన ఇంజక్షన్, మందులు, ఏవైన సరే ఉపయోగించవద్దని హెచ్చరించారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను హెచ్చరించారు. అక్కడకు వచ్చిన రోగులను పలకరించారు. ఎలాంటి అనుమానం వచ్చిన అధికారులను సంప్రదించాలని కోరారు.
కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి
కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో గత కొన్ని రోజులుగా పశువులపై దాడి చేస్తున్న పెద్దపులి ఈరోజు ఉదయం ఓ మహిళపై దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెలుతున్న మహిళ పై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. స్థానికులు చూసిన పులి అక్కడి నుంచి పారిపోయింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
మృతురాలు కాగజ్‌నగర్ మండలం గన్నారం చెందిన మార్లే లక్ష్మీగా గుర్తించారు. మృతదేహంతో కాగజ్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసు ముందు కుటుంబసభ్యుల ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పులి సంచారంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి పులుల రాక పెరిగింది. పులులు జనావాలసాలకు దగ్గరగా సంచరిస్తున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.
పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..
లగచర్ల ఘటనలో అరెస్టయి చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. ఇదే ఘటనపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారని పట్నం నరేందర్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరుగా కేసులు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ కోర్టులో ప్రస్తావించారు. దాడి ఆధారంగా వేర్వేరుగా కేసులు నమోదు చేశారని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. నరేందర్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు..
వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారన్నారు. వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచిన దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారని, విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు గుడివాడ అమర్నాథ్. కేబినెట్ లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, సైకీ తో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నామని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారన్నారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే జగన్ 2.49 పైసలకు కొన్నారని, వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.