రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య ప్రస్థానం సామాన్య విద్యార్థులను సైతం విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతూ IIT-JEE, AIEEE, NEET, Olympiads వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో నెం.1 ర్యాంకులు సాధిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించి... ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచ రికార్డ్ సాధించేందుకు సమాయత్తమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు.
గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీల ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు..ఎవరి వ్యూహాలో వారి మునిగిపోయారు. మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ? గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటుందా ? కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది. 2019 మార్చిలో జరిగిన […]
ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై బిజెపి కసరత్తు ప్రారంభించిందా ? టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతిని ప్రతిపాదించడం ఖాయమేనా ? ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిని రంగంలోకి దించడం వెనుక ఆర్థికబలం, అంగబలం కారణమా ? కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతకు టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా ? తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది. త్వరలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై […]
వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరతగతిన పూర్తి చేస్తాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ, […]
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు.