హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు.. గంటల తరబడి సిగ్నల్ దగ్గర నిరీక్షణ. కానీ, త్వరలోనే మనం ఈ రోడ్లపై పాకాల్సిన అవసరం లేదు.. పక్షుల్లా గాలిలో ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు! అవును, మీరు విన్నది నిజమే. IIT హైదరాబాద్ (IIT-H) పరిశోధకులు పట్టణ ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ‘ఎయిర్ టాక్సీ’ (Air Taxi) ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు. Samsung […]
వరంగల్ జిల్లా జనగామ వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అనే మాటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఎటువంటి కీలక పాత్ర లేకపోయినా, కేవలం గౌరవంతో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, కానీ ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ద్రోహం […]
సాధారణంగా టీవీ అంటే గోడకు కొంత దూరంగానో లేదా స్టాండ్‌పైనే ఉంటుంది. కానీ, ఎల్జీ (LG) మళ్లీ పరిచయం చేసిన ‘వాల్‌పేపర్ టీవీ’ని చూస్తే అది అసలు టీవీనా లేక ఏదైనా పెయింటింగా అనే సందేహం కలగక మానదు. 2020లో నిలిపివేసిన ఈ వినూత్న కాన్సెప్ట్‌ను, ఇప్పుడు మరింత శక్తివంతమైన టెక్నాలజీతో W6 OLED పేరుతో ఎల్జీ తిరిగి ప్రవేశపెట్టింది. 1. ఆకట్టుకునే స్లిమ్ డిజైన్ (Picture-Frame Effect) LG W6 టీవీ కేవలం 9 […]
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్, లాస్ వెగాస్‌లో జరుగుతున్న CES 2026 వేదికగా తన ఫ్లాగ్షిప్ ల్యాప్‌టాప్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ‘Galaxy Book6’ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కేవలం డిజైన్ పరంగానే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాల్లో కూడా ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 1. గెలాక్సీ AI (Galaxy AI) మ్యాజిక్ Galaxy Book6 సిరీస్ మొత్తం శాంసంగ్ సొంత Galaxy AI , మైక్రోసాఫ్ట్ Copilot+ శక్తులతో నడుస్తుంది. ఇది వీడియో కాల్స్ […]
Duddilla Sridhar Babu: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారరు. మనం ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లో ఉన్నామని, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ, ఈ భూమిపై పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని అసమర్థ నాగరికతలో ఉన్నామనేది చేదు నిజం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపి, రాబోయే తరాలకు ఒక ‘క్లీన్ ఎన్విరాన్ మెంట్’ను అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హిల్ట్’ (HILT) పాలసీకి […]
తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ. 3,000 కోట్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం. సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా నిధులు వసూలు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు […]
ఏపీ సీఎం చంద్రబాబు అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మర్చిపోయారా? లేక ఆయన్ని కొందరు మభ్య పెడుతున్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా హడావిడి చేసిన ఓ మేటర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఏమో…. సెటిల్ అయిందేమో…. అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏ విషయంలో బాబు వైఖరి అంతలా చర్చనీయాంశం అవుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఏదేదో […]
ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా? ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నా… ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక ఛైర్మన్‌కు కూడా తప్పదా? నిజంగానే ఆమోద ముద్ర పడితే… అది ఎవరికి లాభం? ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ నేత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద పోటీ చేయగలరా? లెట్స్ వాచ్. శాసనమండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత… అందుకు కారణాలను ఇవాళ సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి […]
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పని చేయడం , జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘పొట్ట చుట్టూ కొవ్వు’ (Belly Fat). ఈ కొవ్వు శరీర ఆకృతిని పాడు చేయడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు లేకుండా, కేవలం మన వంటింట్లో దొరికే సొరకాయ (Bottle Gourd) జ్యూస్‌తో ఈ సమస్యకు పరిష్కారం […]
తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ 2002 అక్టోబర్ 11వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు సునీల్ వివాహం ‘శృతి’తో 2002 అక్టోబర్ 11న అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటల 28 నిమిషాలకు సుముహూర్తాన వీరి వివాహ […]